విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం తొందరగా అందించాలని సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.సి. కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పర్యటించి ఎలాంటి కోర్టు వివాదాలు లేని భూముల జాబితాను సిద్ధం చేయాలని తహసీల్దార్లను సంయుక్త కలెక్టర్ ఆదేశించారు.
ఆక్రమిత భూములు, వివాదాల భూములను వెంటనే గుర్తించాలన్నారు. జిరాయితీ, ప్రభుత్వ భూమి, డి పట్టాదారులకు పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటి వరకు 1504 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు సంయుక్త కలెక్టర్ కు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి బిహెచ్. భవానీశంకర్, కేఆర్సీ ప్రత్యేక ఉపకలెక్టర్ బాలత్రిపుర సుందరి, ప్రత్యేక అధికారి అప్పలనాయుడు, భోగాపురం తహసీల్దారు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : కూతురు నగ్న చిత్రాలు తీసిన తండ్రి... నిందితుడు అరెస్ట్