విజయనగరం బహిరంగ మార్కెట్లలో అధిక ధరలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అమ్ముతున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిజనిర్ధరణకు జాయింట్ కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగారు. పల్లెటూరి రైతు వేషం ధరించిన జేసీ కిశోర్ కుమార్... రాజీవ్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతుబజార్లలో కూరగాయలు కొన్నారు. అన్ని సరుకులు, దుకాణాల వద్దకు వెళ్లి సాధారణ వినియోగదారునిలా ధరలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మకాలు జరుగుతున్నాయని, ఉల్లి, టమాటాలను ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్న విషయాన్ని గుర్తించామని జేసీ కిశోర్ తెలిపారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసులు