విజయనగరం జిల్లా కలెక్టర్ జవహర్ లాల్ చొరవతో ఇద్దరు కొవిడ్ బాధిత వృద్ధ దంపతులకు వైద్య సహాయం అందింది. జిల్లా కేంద్ర ఆసుపత్రి సమీపంలోని రాయల్ అపార్ట్మెంట్లో అప్పలస్వామి(104), చిన్నమ్మ(98)దంపతులు వారి కుమార్తె ఇంట్లో నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం వారి అల్లుడు కొవిడ్‌తో మరణించారు. కుమార్తె సైతం కొవిడ్ బారిన పడి.. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో వృద్ధులు ఒంటరయ్యారు. వీరికి కొవిడ్ వచ్చిందనే అనుమానంతో ఆహారం, మంచినీళ్లు అందించడానికి కూడా పొరుగు వారు సాహసించలేదు.
అయితే వృద్ధ దంపతుల దూరపు బంధువులు చరవాణీ ద్వారా కలెక్టర్ హరి జవహర్ లాల్‌కు సమాచారం చేరవేశారు. ఒంటరిగా ఉంటున్న వారికి వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి సంయుక్త కలెక్టర్ వెంకటరావుకు బాధ్యతలు అప్పగించారు. జేసీ రాయల్ అపార్ట్‌మెంట్‌కు చేరుకోని ఆ వృద్ధ దంపతులకు ఆహారం, మంచినీళ్లు ఏర్పాటు చేశారు. నెహ్రూ యువజన కేంద్రం వారి సహకారంతో వారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ సకాలంలో స్పందించి.. వృద్ధులను వైద్య చికిత్సకు తరలించటంపై వారి బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: