విజయనగరం జిల్లా నెల్లిమర్లలో కరోనా బాధితుడు మృతదేహాన్ని ఖననం చేయకుండా స్థానికులు అడ్డుకున్నారు. విమ్స్ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందే వారి మృతదేహాలను ఖననం చేసేందుకు నెల్లిమర్ల రెవెన్యూ పరిధిలో ఖననం చేసేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో... కొండపేట ప్రాంతంలో ఖననాలు చేసేందుకు ప్రొక్లైన్తో గుంతలు తవ్వించారు. కరోనా బాధిత మృతదేహాలు తమ ప్రాంతంలో పూడ్చిపెట్టేందుకు వీల్లేదని స్థానికులు అడ్డుచెప్పారు.
చంద్రబాబునగర్ కాలనీ సమీపంలో ఉన్న రిజర్వ్ అటవీ ప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా... స్థానికులు అభ్యంతరం చెప్పారు. చేసేది లేక స్థానిక డైట్ ప్రాంతంలో రెవెన్యూ, నగర పంచాయతీ అధికారుల సమక్షంలో అంతిమ సంస్కరాలకు ఏర్పాట్లు మెుదలు పెట్టారు. అక్కడ సైతం అధికారుల్ని అడ్డిగించి... గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో జిల్లా స్థాయి అధికారులు వచ్చి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం కరోనా బాధిత మృతదేహానికి పోలీసుల బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇదీ చదవండి: