మద్యం మహమ్మారి నుంచి బయటపడాలని విజయనగరంజిల్లా సాలూరు మండలంలోని మెట్టవలసకు చెందిన గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. వీరితోపాటు హనుమంతువలస, మామిడివలస, దిగువ మెండంగి గ్రామస్తులు సైతం ముందుకొచ్చారు. ఆయా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు, యువకులు, గ్రామపెద్దలూ సమావేశమై మద్యాన్ని నిషేధించాలని, అమ్మకాలను సైతం నిలిపి వేయాలని తీర్మానించారు. ఇకనుంచి తమ గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరపవద్దని, విక్రయదారులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్: చంద్రబాబు