పాఠశాలల నాడు నేడు పనుల్లో విజయనగరం కార్పొరేషన్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మన బడి నాడు - నేడు పనులను గడువుకు ముందే పూర్తి చేసుకుని నగరపాలక సంస్థ ఈ ఘనత సాధించింది. ఈ మేరకు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసాపత్రం అందుకుంది. విజయనగరం నగరపాలక సంస్థకు నాడు-నేడు అభివృద్ధి పనుల్లో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు లభించడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి