సాయంత్రం వరకే వ్యాపారాలు..
* గుంటూరులో ఈ నెల 25 నుంచి రాత్రి 7- ఉదయం 6 గంటల మధ్య పూర్తి కర్ఫ్యూ అమలుచేయాలని నిర్ణయించారు. బుధవారం సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూతపడ్డాయి. గురువారం నుంచి నరసరావుపేటలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే వ్యాపార, వాణిజ్య సంస్థలు పనిచేయాలని నిర్ణయించారు.
* విజయనగరంలో సాయంత్రం 6 గంటల తర్వాత దుకాణాలు మూసేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. బొబ్బిలిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే కిరాణా, కూరగాయల దుకాణాలు తెరుస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరవాలని ఆర్డీవో నిషేధాజ్ఞలు విధించారు.
* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, పాలకొల్లు, ఆచంట తదితర ప్రాంతాల్లో అన్ని దుకాణాలూ సాయంత్రం 6 గంటలకు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. ఆదివారం పూర్తిగా తెరవకూడదని నిర్ణయించారు.
ఆ ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకే...
విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి, ముంచంగిపుట్టులో ఈ నెల 30వ తేదీ వరకూ మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరవాలని వ్యాపారులు తీర్మానించి అమలు చేస్తున్నారు. మన్యంలోని డుంబ్రిగూడలో మధ్యాహ్నం 3 గంటలు, కె.కోటపాడులో మధ్యాహ్నం ఒంటిగంట వరకే దుకాణాలు తెరుస్తున్నారు. కడప జిల్లా రైల్వేకోడూరులో మధ్యాహ్నం 2 గంటలకే దుకాణాలు మూసేస్తున్నారు.
* విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురం, కురపాంలలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత దుకాణాలు మూసేస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఆర్డీవో ఆదేశించారు.నీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, సోంపేటలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నారు. నీ ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్న 19 మండలాల్లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఉదయం 6-10, సాయంత్రం 4-6 మధ్యే దుకాణాలు తెరవాలని నిర్దేశించారు.
ఇవీ చదవండి: