విజయనగరం జిల్లా కురుపాం రెవెన్యూ పరిధిలోని టెకరకండి, పాతుని వలస గ్రామాల గిరిజనులు.. ఆ ప్రాంతంలో జరుగుతున్న గిరిజన ఇంజినీరింగ్ కళాశాల పనులను అడ్డుకున్నారు. గిరిజనుల నుంచి 105 ఎకరాల భూమిని ఇంజినీరింగ్ కళాశాల కోసం తీసుకున్నారు. అయా భూములకు నష్ట పరిహారం చెల్లించిన తర్వాత.. పనులు చేపట్టాలని రెండు గ్రామాల గిరిజనులు, గిరిజన సంఘం నాయకులు, సీపీఎం పార్టీ నాయకులు పనుల జరుగుతున్న ప్రదేశంలో ఆందోళన చేపట్టారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోలక అవినాష్, వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, గిరిజన సంఘం నాయకులు కురంగి సీతారాం, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...