ETV Bharat / state

ఛత్తీస్​గఢ్​లో మావో ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఏపీ జవాన్లు మృతి - List of names of the martyred in bijapur naxal encounter

ఛత్తీస్​గఢ్​లోని బీజాపూర్-సుకుమా సరిహద్దులోని జోనాగుడా వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లాకు చెందిన జగదీశ్, గుంటూరు జిల్లాకు చెందిన మురళీకృష్ణగా అధికారులు గుర్తించారు.బీజాపుర్‌-సుకుమా జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలోని జాగర్‌గుండా, జొంగాగూడ, తారెం ప్రాంతంలో వ్యూహత్మక ప్రతిదాడిపై మావోయిస్టులు చర్చలు జరుపుతున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. ఫలితంగా భద్రతాదళాలు ఆపరేషన్‌ చేపట్టాయి.

ఛత్తీస్​గఢ్​లో మావో ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఏపీ జవాన్లు మృతి

author img

By

Published : Apr 4, 2021, 9:10 PM IST

Updated : Apr 5, 2021, 1:09 AM IST

ఛత్తీస్​గఢ్​లోని బీజాపూర్ - సుకుమా సరిహద్దు గ్రామమైన జోనాగుడా వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో.. 23 జవాన్లు ప్రాణాలు కోల్పోగా... 31మంది జవాన్లకు గాయాలయ్యాయి. చనిపోయిన జవాన్లలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఇద్దరు ఉన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన జగదీశ్‌, గుంటూరు జిల్లాకు చెందిన మురళీకృష్ణ.. ఈ ఘటనలో అమరులైనట్టు అధికారులు వెల్లడించారు.

చికిత్స నిమిత్తం బీజాపూర్​ తరలింపు..

ఈ ఘటనలో... డీఆర్​జీకి చెందిన ఎనిమిది మంది, ఎస్​టీఎఫ్​కు చెందిన ఆరుగురు, కోబ్రా బెటాలియన్​కు చెందిన ఏడుగురు, బస్తర్ బెటాలియన్​కు చెందిన మరొక జవాను మృత్యువాత పడ్డారు. ఎదురుకాల్పుల్లో 13 మందికి తీవ్ర గాయాలవ్వగా... 18 మంది జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని బీజాపూర్​లోని ఆస్పత్రికి తరలించారు.

చరిత్రలోనే అతిపెద్ద దాడి..

ఛత్తీస్​గఢ్​ బీజాపూర్​లోని అడవుల్లో... చరిత్రలోనే భద్రతాదళాలపై అతిపెద్ద దాడిగా అభివర్ణిస్తున్న ఎదురుకాల్పుల ఘటనలో దాదాపు 400 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.

చర్చిస్తున్నట్లు అందిన సమాచారం..

బీజాపుర్‌-సుకుమా జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలోని జాగర్‌గుండా, జొంగాగూడ, తారెం ప్రాంతంలో వ్యూహత్మక ప్రతిదాడిపై మావోయిస్టులు చర్చలు జరుపుతున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. ఫలితంగా భద్రతాదళాలు ఆపరేషన్‌ చేపట్టాయి. సీఆర్​పీఎఫ్​కు చెందిన ప్రత్యేక అటవీ విభాగం 'కోబ్రా' సహా బస్తరీయా బెటాలియన్‌, ఛత్తీస్‌గడ్ పోలీసులకు చెందిన డీఆర్​జీ బృందాలు పాల్గొన్నాయి. మొత్తంగా 6 క్యాంపులకు చెందిన 15 వందల మంది జవాన్లు.. ఆపరేషన్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వీరిలో 790 మంది ఆపరేషన్‌ కోసం అడవుల్లోకి వెళ్లగా మిగతా వారు వారికి సాయం అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

రెచ్చిపోయిన నక్సల్స్..

ఘటనా స్థలం వ్యూహాత్మకంగా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం. కఠిన భూభాగంతో పాటు తక్కువ సంఖ్యలో భద్రతా బలగాల కదలికలు ఉండే గ్రామం అది. జవాన్లు సరిగ్గా అక్కడకు చేరుకోగానే దాదాపు 400 మంది నక్సల్స్‌ మూడు వైపుల నుంచి చుట్టుముట్టారు. జవాన్లపై లైట్‌ మెషిన్‌ గన్లతో బుల్లెట్ల వర్షం కురిపించారు. వీటితో పాటు తక్కువ ప్రభావం చూపే ఐఈడీ బాంబులను విసిరారు. ఈ ఎదురుకాల్పుల్లో 23 మంది అమరులయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దీనికి భద్రతా బలగాలు కూడా దీటుగా స్పందించాయి. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ఎదురుకాల్పులు రాత్రి వరకు కొనసాగాయి. ఘటనలో దాదాపు 10 నుంచి 12 మంది.. మావోయిస్టుల చనిపోగా, వారిని సహచర మావోయిస్టులు ట్రాక్టర్‌ ట్రాలీల్లో తీసుకువెళ్లిపోయారు. ఈ దాడికి మావోల నుంచి పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌కు చెందిన హిద్మా, సుజాత నేతృత్వం వహించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

జవాన్ల తెగువ..

మధ్యాహ్నం రెండు గంటలకు భద్రతా దళాలు హెలికాఫ్టర్లను సాయం కోసం కోరగా, భీకర కాల్పుల కారణంగా అవి సాయంత్రం 5 గంటల వరకు ఘటనా స్థలంలో ల్యాండ్‌ కాలేని పరిస్థితి నెలకొంది. చాలావరకు జవాన్లు..... బుల్లెట్‌ గాయాలతోనే మరణించారని అధికారులు తెలిపారు. సహచర జవాన్లు నేలరాలుతున్నా కోబ్రా యూనిట్‌ ధైర్యంగా పోరాడిందని అధికారులు ప్రశంసించారు. వీరి ధైర్యం వల్లే నక్సల్స్‌ మరికాసేపు కాల్పులను కొనసాగించలేకపోయారని తెలిపారు. పెద్ద చెట్లను అడ్డుగా చేసుకొని, బుల్లెట్లు అయిపోయే వరకు భద్రతా బలగాలు ప్రతిఘటించారన్నారు. భద్రతా దళాలకు చెందిన దాదాపు 2 డజన్ల ఆధునాతన ఆయుధాలను నక్సల్స్‌ లూటీ చేశారని అధికారులు వెల్లడించారు.

ఘటనపై అమిత్​ షా ఆరా..

బీజాపుర్​ ఎన్​కౌంటర్​ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్​తో ఫోన్​లో మాట్లాడారు. సీఆర్​పీఎఫ్​ డైరెక్టర్​ జనరల్​ కుల్దీప్​ సింగ్​ను పరిస్థితిని సమీక్షించాలని షా ఆదేశించారు.

పోరాటం కొనసాగుతుంది : అమిత్ షా

ఎన్​కౌంటర్​లో అమరులైన భద్రతా సిబ్బంది కుటుంబాలకు అమిత్​ షా సంతాపం తెలిపారు. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. శాంతి వ్యతిరేకులపై తమ పోరాటం కొనసాగుతుందని ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

పవన్ రాష్ట్రానికి అద్దె మైకులా తయారయ్యారు: పేర్ని నాని

Last Updated : Apr 5, 2021, 1:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.