బర్లి వద్ద ఆర్టీసీ బస్సులు ఢీ విజయనగరం జిల్లా బలిజపేట మండలం బర్లి వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బొబ్బిలి నుంచి అరసాడ వెళ్తున్న బస్సును.. ఉద్దవోలు నుంచి బొబ్బిలి వస్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సుల ముందు భాగం దెబ్బతింది. ఉద్దవోలు నుంచి వస్తున్న బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదీ చదవండి: 70 ఏళ్ల వయస్సులో.. ఆకట్టుకున్న బల ప్రదర్శన