కాలువలో జారిపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా గులివింద అగ్రహారం తోటపల్లి వద్ద చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న గౌరీశంకర్, సతీష్‌లు పాఠశాల విడిచిపెట్టగానే దగ్గరలో ఉన్న కాలువ వద్దకు ఈత కోసం వెళ్లారు. కాలువలో దిగగా లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి మృతి చెందారు. గౌరీ శంకర్ రెండవ తరగతి చదువుతుండగా..సతీష్ 4 వతరగతి చదువుతున్నారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఒకేసారి ఇద్దరు చిన్నారులు మృతి చెందటంతో అగ్రహారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీచదవండి