డోలీ కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని సాలూరు గిరిజనులు పార్వతీపురం ఐటీడీఏ వద్ద రిలే నిరాహార దీక్షలకు దిగారు. అనారోగ్యం బారిన పడిన వారిని డోలీలతో తరలించే బాధల నుంచి తమకు విముక్తి కలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. సరైన రహదారి లేక గర్భణీలను ప్రమాదకరంగా డోలీలో తరలిస్తుంటే, కొన్ని సార్లు తల్లిబిడ్డా కూడా చనిపోతున్నారని వాపోయారు. ఇటీవల 13 కీ.మీ దూరం డోలీతో తీసుకెళ్లినా, తల్లిబిడ్డా మృత్యువాత పడిన ఘటనను వారు ఉదహరిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా రహదారి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నామని, ఇకనైనా తమ ప్రాంతానికి వాహనాలు వచ్చేలా చూడాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీచూడండి.రాష్ట్రానికి నాలుగు స్వచ్ఛ అవార్డులు