తెదేపా అధినేత చంద్రబాబు, విజయనగం తెదేపా తరఫునఅసెంబ్లీఅభ్యర్థిగా అశోక్ గజపతి రాజు కుమార్తె, అదితి గజపతి పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా విజయనగరం అశోక్ బంగ్లాలో అశోక్ గజపతి రాజు, కుటుంబ సమేతంగా సమావేశమయ్యారు. తెదేపా నాయకులు,కార్యకర్తలు ఈ సమావేశానికి సమావేశమయ్యారు. విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తన కూతురికి మద్దతు పలకాలని అశోక్ గజపతి రాజు... పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు. ఈ నెల 20న ఎంపీ అభ్యర్థిగా గజపతి రాజు , ఎమ్మెల్యే అభ్యర్థిగా అదితి ఇద్దరూ ఒకేసారి నామినేషన్లు వేయనున్నారు.
విజయనగరానికి కొత్త "అతిథి" - అదితి గజపతి
విజయనగర సంస్థానం నుంచి మరొకరు రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు. తెదేపా సీనియర్ నేత , కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి విజయనగరం నుంచి పోటీ చేయబోతున్నారు. పార్టీ అధిష్టానం ఆమెకు టికెట్ ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. అదితి ఈనెల 20 న తండ్రితో కలిసి నామినేషన్ వేయనున్నారు.