తెదేపా నేత అచ్చెన్నాయుడి అరెస్టును ఖండిస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వం ఎస్సీలు, బీసీలపై కక్షతో వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆరోపించారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతో ముందస్తుగా ఆయన్ని కిడ్నాప్ చేశారని చెప్పారు. సుమారు 300 మంది పోలీసులతో వేకువజామున తీసుకువెళ్లిన అచ్చెన్నాయుడిని ఎక్కడ ఉంచారో కూడా తెలియడం లేదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ఎస్సీలు, బీసీలపై అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించారు. ఇటువంటి చర్యలు మానుకోవాలని హితవుపలికారు. తక్షణమే అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'ప్రభుత్వాన్ని నిలదీస్తారనే అచ్చెన్నాయుడి అరెస్ట్'
అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతో ముందస్తుగా ఆయన్ని కిడ్నాప్ చేశారని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఎస్సీలు, బీసీలపై కక్షతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
తెదేపా నేత అచ్చెన్నాయుడి అరెస్టును ఖండిస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వం ఎస్సీలు, బీసీలపై కక్షతో వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆరోపించారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతో ముందస్తుగా ఆయన్ని కిడ్నాప్ చేశారని చెప్పారు. సుమారు 300 మంది పోలీసులతో వేకువజామున తీసుకువెళ్లిన అచ్చెన్నాయుడిని ఎక్కడ ఉంచారో కూడా తెలియడం లేదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ఎస్సీలు, బీసీలపై అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించారు. ఇటువంటి చర్యలు మానుకోవాలని హితవుపలికారు. తక్షణమే అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'పక్కా ఆధారాలతోనే అచ్చెన్నాయుడు అరెస్టు'