విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో మార్కెట్ కమిటీల పరిధిలో గోదాముల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. బలిజిపేట మండల కేంద్రంలో సుమారు పది వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రెండు గోదాములను భారత ఆహార సంస్థ నిర్మిస్తోంది. బొబ్బిలి పట్టణంలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో మరో పది వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రెండు గోదాముల నిర్మాణం జరుగుతోంది.
తెర్లాం రామభద్రపురం మండల కేంద్రాల్లోనూ సుమారు రెండు కోట్లతో గోదాములు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర వచ్చేవరకు నిల్వ చేసుకునేందుకు వీలుగా కొన్ని గోదాములను సిద్ధం చేస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రేషన్ డిపోలకు తరలించే బియ్యాన్ని నిల్వ చేసేందుకు ప్రస్తుతం గోదాముల కొరత ఉంది. బియ్యాన్ని నిల్వ చేసేందుకు మరికొన్ని గోదాములను రెడీ చేస్తున్నారు.
గోదాముల కొరతను అధిగమించేందుకు అధికారులు ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏటా గోదాముల కొరతతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లాలో ఈ పరిస్థితులు లేకుండా ఉండేందుకు అన్నిచోట్ల గోదాములు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు. మార్కెట్ కమిటీ స్థలాల్లో వీటిని నిర్మించేందుకు చర్యలు ప్రారంభించారు.
ఇదీ చదవండీ... వాతావరణం: ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక