విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కెరంగిలో కన్న తండ్రిని కుమారుడే హత్య చేశాడు. గ్రామానికి చెందిన చేబి పోతయ్య అనే వ్యక్తి అతనికున్న మూడు ఎకరాల పొలాన్ని తన ముగ్గురు కొడుకులకు సమానంగా ఇచ్చారు. ఈ పంపకాల విషయంలో రెండవ కుమారుడు తిరుపతిరావు, తండ్రికి మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. నిన్న రాత్రి తిరుపతిరావు మద్యం మత్తులో తండ్రిని కర్రతో కొట్టి చంపాడు.
ఇదీ చదవండి: అడ్మిషన్లు చేపట్టాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన