ETV Bharat / state

విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్​ ప్రారంభం - విజయనగరం పంచాయతీ ఎన్నికలు న్యూస్

పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. కృష్ణపల్లిలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంఆర్ నగరంలో నడవలేని వృద్ధురాలిని మోసుకుంటూ పోలింగ్ బుత్​కి చేర్చి.. రూరల్ ఎస్సై తన మంచి మనసును చాటుకున్నారు.

vijayanagaram polling
జయనగరం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్
author img

By

Published : Feb 13, 2021, 11:12 AM IST

పార్వతీపురంలో...

విజయనగం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో.. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటలకే పోలింగ్ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో.. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. గ్రామంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. గ్రామస్తులు బారులు తీరారు.

సాలూరు మండలంలో...

సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో 6.30 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను.. పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

ఆదర్శంగా నిలిచిన ఎస్సై

జయనగరం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్

శాంతి భద్రతల పరిరక్షణకే కాదు.. సేవలోనూ ముందుంటామని పోలీసులు మరోమారు రుజువు చేశారు. పార్వతీపురం మండలం ఎంఆర్ నగరంలో.. నడవలేని వృద్ధురాలిని మోసుకుంటూ పోలింగ్ బూత్​కు చేర్చారు రూరల్ ఎస్సై వీరబాబు.

ఇదీ చదవండి: పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 8.30 గంటలకు ఓటింగ్ శాతం ఎంతంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.