కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ప్రముఖ సాహితీవేత్త మానా ప్రగడ శేషసాయి తుదిశ్వాస విడిచారు. పశ్చిమగోదావరి జిల్లా గున్నవరులో 1927 సంవత్సరంలో జన్మించిన ఆయన... 1966లో విజయనగరం వచ్చారు. మహారాజ ప్రభుత్వ సంస్క్రత కళాశాలకు అధ్యక్షులుగా 13 సంవత్సరాలపాటు సేవలందించారు. ఆయన కృషితో ఈ కళాశాల యూజీసీ గుర్తింపు పొందింది.
తిరుపతి బ్రహ్మోత్సవాలు, రామతీర్థం, అన్నవరం, భద్రాచలం కల్యాణోత్సవాల్లో శేషసాయి వ్యాఖ్యానం ఎప్పటికీ నిలిచిపోతుంది. శ్రీచందనం, శ్రీ సత్యదేవ శతకం, ఆంధ్ర సాహిత్యంలో హాస్యం, శ్రీ మల్లికార్జున శతకం, ప్రసన్న భాస్కరం, జయదేవ సరస్వతి, విజయనగరం పైడితల్లి అమ్మవారి సుప్రభాతం రచనలతో.. శేషసాయి ప్రతిభ దశదిశలా వెలుగొందింది.
శ్రీ రామయణాన్ని రచిస్తున్న క్రమంలోనే.. శేషసాయి కన్నుమూశారు. ఆయన మరణంపై తెలుగు సాహితీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. భౌతికంగా వారు తమ మధ్య లేకున్నా.. తెలుగు సాహితీ ప్రేమికుల గుండేల్లో ఎప్పటికీ ఉండిపోతారని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు.
ఇది కూడా చదవండి.