విజయనగరం జిల్లా కురుపాం మండలం గుమ్మ గ్రామంలో 250 మంది నిరుపేదలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. స్థానిక గ్రామ సచివాలయంలో గుమ్మ గ్రామం చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల్లోని వారికి బియ్యం, కూరగాయలు అందజేశారు. అనంతరం గ్రామంలో ఉన్న 32 మహిళా సంఘాలకు వైయస్సార్ సున్నా వడ్డీ పథకం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి మూటక రాజేశ్వరి, నాయకులు దమయంతి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి.. సీఎం జగన్ చిత్రపటానికి వాలంటీర్ల దండం..!