బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆస్తులపై దేవదాయశాఖ దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు అనువంశక ధర్మకర్త బేబినాయన అన్నారు. స్వామివారి ఆస్తులకు సంబంధించిన అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కానీ దేవదాయశాఖ అధికారులు మాత్రం ఆస్తుల వివరాలు తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆలయ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పటికైనా గుర్తించాలని బేబినాయన కోరారు. ఆలయ భూములు, నగలపై దర్యాప్తు కోసం గురువారం దేవదాయశాఖ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రూ.కోట్లు ఆస్తులున్నా ధూపం, దీపం నైవేద్యానికి నోచుకోలేదని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఇటీవల మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు రికార్డులు తీసుకుని వెళ్లారు.
ఇవీ చదవండి