Lakshmidevi Blessings : ప్రతి ఒక్కరి జీవితంలో సుఖాలతో పాటు కష్టాలు కూడా ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుంటే కష్టాల నుంచి గట్టెక్కే వీలుంటుంది. ఆర్థికంగా బాగుండడం అంటే అవసరానికి సరిపడా డబ్బులు ఉన్నాయని అని అర్థం. అయితే చాలా మంది అవసరాలకు సరిపడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కొంత మంది తరచూ అప్పులు చేస్తూ వాటిని తీర్చలేని పరిస్థితిలో కూరుకుపోతారు. మరికొందరు తెలిసిన వారికి, మిత్రులకు అప్పులు ఇచ్చి అవి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో అందరి అవసరాలు తీర్చే డబ్బు మన ఇంటికి రావాలంటే లక్ష్మీ దేవి కటాక్షం ఉండాలంటున్నారు పండితులు. ఆర్థిక సమస్యలు ఉండకూడదు అంటే లక్ష్మి అనుగ్రహం కలగడం తప్పనిసరి అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు.
ఆ స్వామి విగ్రహం నిలువెల్లా విషం - తొడ భాగంలో విభూతి పంపిణీ
లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతోందని తెలిపే ఐదు సంకేతాలు ఇవే :
లక్ష్మీదేవి ఆగమనం జరగబోతోందని కొన్ని సంకేతాల ద్వారా ముందే తెలుసుకోవచ్చని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. ధనపరంగా, ఖర్చులు తగ్గడం, ఆర్థిక స్థిరత్వం కలుగుతుందనే కొన్ని సంకేతాలు ముందుగానే మనకు తెలుస్తాయని, వాటిని ఎలా గుర్తించాలో వివరిస్తున్నారు.
- ఉదయం నిద్ర లేవగానే తెల్లని పక్షి కనిపిస్తే అదృష్ట దేవత ఇంటి తలుపు తట్టినట్లే అని తెలిపారు.
- ఉదయం నిద్ర లేవగానే కొబ్బరికాయ చూసినా అనేక మార్గాల్లో ధనాదాయం వచ్చి చేరుతుందని వెల్లడించారు.
- నిద్ర లేవగానే గడ్డి మేస్తున్న ఆవు కనిపిస్తే విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పారు.
- చాలా మందికి కలలో పాములు కనిపించడం సహజమే. అయితే పాము వెంట పడుతున్నట్లు కల వస్తే వారికి సర్పదోషం ఉంటుందంటున్నారు. కానీ, పాము పడగ విప్పినా, కాటేస్తున్నట్లు ఉన్నా విశేషమైన రాజయోగం పట్టుకుంటుందని మాచిరాజు తెలిపారు.
- కలలో శ్వేత నాగు, బంగారు రంగు పాము లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతమని, కాటేసినట్లుగా కల వచ్చినా ఇంకా అద్భుతం అని వివరించారు. పడగ ఎత్తి మీ వైపు చూసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భావించాల్సిందిగా వెల్లడించారు.
ఇవేగాకుండా ఎప్పుడైనా పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లేటపుడు కుడివైపుగా కోడి వెళ్తే లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుందని మాచిరాజు తెలిపారు. కుక్క ఆగమనం కూడా అదృష్టమేనని, కుడి వైపు పక్షి ఎగురుకుంటూ వెళ్తే తొందర్లోనే రాజయోగం పట్టబోతోందని శాస్త్రాల్లో చెప్పడం జరిగిందని మాచిరాజు కిరణ్ కుమార్ వెల్లడించారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.