విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ... విద్యార్థి, యువజన, కార్మిక, ప్రజా సంఘాలు విజయనగరంలోని అమర్ భవన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించాయి. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే.. పెద్దఎత్తున ఉద్యమాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర హెచ్చరించారు. ర్యాలీలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్, ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీ.జీవన్, విద్యార్థులు పాల్గొన్నారు.
'స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి' - విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయనగరంలో ర్యాలీ
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. విజయనగరంలో విద్యార్థి, యువజన, కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా అమర్ భవన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ... విద్యార్థి, యువజన, కార్మిక, ప్రజా సంఘాలు విజయనగరంలోని అమర్ భవన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించాయి. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే.. పెద్దఎత్తున ఉద్యమాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర హెచ్చరించారు. ర్యాలీలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్, ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీ.జీవన్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
'ఒడిశా వల్ల మాకు ఒరిగేదేమి లేదు...ఏపీతోనే ఉంటాం'