ETV Bharat / state

వడదెబ్బకు ఉపాధి హామీ కూలీ మృతి - LABOUR

పొట్ట కూటి కోసం ఉపాధి పనికి వెళ్లిన ఓ కూలీ వడదెబ్బకు గురై మరణించాడు. మృతునికి భార్య, పదో తరగతి చదువుతున్న ఓ కుమారుడు ఉన్నారు.

మృతుడి ఆధార్ కార్డు
author img

By

Published : May 11, 2019, 6:42 AM IST

వడదెబ్బకు ఊపిరి ఆగింది
విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామంలో వడదెబ్బకు ఉపాధి హామీ కూలీ మృతి చెందారు. గ్రామానికి చెందిన రామినాయుడు(54) శుక్రవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనులు ముగిశాక తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురైయ్యారు. తోటి కూలీలు ఆయన్ను ఇంటికి తీసుకొచ్చే సమయంలోనే మృతి చెందారు. రామి నాయుడుకు భార్య, 10వ తరగతి చదువుతున్న కుమారుడు కలరు. గరివిడి మండల పోలీసులు, గ్రామ వీఆర్​వో సమక్షంలో డాక్టర్ జ్యోత్స్న శవపంచనామా నిర్వహించారు.
Intro:AP_ONG_12_05_BADMINTON_TRAINING_OPEN_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...............................................................................
అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రకాశం జిల్లా ఒంగోలులో ది లార్డ్ కృష్ణ.. భాస్కర్ బాబు బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేయడం జరిగిందని అకాడమీ చైర్మన్ శిద్దా సుధీర్ కుమార్ అన్నారు. మంగమూరు రోడ్డు లోని లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు కరణం పున్నయ్య చౌదరి తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 9న మంత్రి సిద్ధ రాఘవరావు చేతులమీదుగా అకాడమీ ప్రారంభించినట్లు సుధీర్ కుమార్ తెలిపారు. హైదరాబాదులో ని గోపీచంద్ అకాడమీకి దీటుగా అన్నీ అధునాతన సదుపాయాలతో నాలుగు సింథటిక్ కోర్టులతో ఇక్కడ చిన్నారులకు శిక్షణ అందించడం జరుగుతుందని వివరించారు. అనంతరం పున్నయ్య చౌదరి మాట్లాడుతూ బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయడంతో పాటు 12 మందికి పైగా జాతీయ క్రీడాకారులు ఒక సంవత్సరం లోనే తయారుచేసిన భాస్కర్ భాస్కర్ బాబు లాంటి కోచ్ ఇక్కడ శిక్షణ ఇవ్వడం క్రీడాకారులకు వరం అని అన్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో ప్రకాశం జిల్లా క్రీడాకారులకు ప్రత్యేకమైన స్థానం ఉందని పున్నయ్య చౌదరి వివరించారు . బ్యాడ్మింటన్లో గొప్ప ఆటగాడు గా పేరొందిన గోపీచంద్ తో పాటు అనేకమంది జాతీయస్థాయి క్రీడాకారులు ప్రకాశం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించారని తెలిపారు....బైట్స్
శిద్దా సుధీర్ కుమార్, ది లాడ్ కృష్ణ భాస్కర్ బాబు బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్
కరణం పున్నయ్య చౌదరి, ఉపాధ్యక్షుడు ,బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా .



Body:ongole


Conclusion:9100075319

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.