మేళతాళాలు, వేద మంత్రాలు నడుమ ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవమైన పైడితల్లమ్మ తొలేళ్ల ఉత్సవం(paidithallamma Tolella usthsavam) వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి 11గంటల సమయంలో అమ్మవారిని తొలేళ్లకు సిద్ధం చేస్తూ పురోహితులు వివిధ నదీ జలాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మరోవైపు అమ్మవారికి ఘట్టాలను సమర్పించారు. కరోనా వ్యాప్తి కారణంగా విజయనగరం(vizianagaram district)లోని వివిధ ప్రాంతాల నుంచి ఘట్టాలను పరిమిత సంఖ్యలో తీసుకువచ్చారు.
హుకుంపేట, పుచ్చలవీధి, ఉల్లివీధి, గంటస్తంభం మీదుగా అమ్మవారి ఆలయానికి ఈ ఘటాలు చేరుకున్నాయి. ఆలయం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఘట్టాలను మేళతాళాల నడుమ కోట శక్తి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఊరేగింపుగా రాత్రి 12.45గంటలకు అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. సిరిమాను అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం విజయనగరం పరిసర ప్రాంతం రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి