ETV Bharat / state

Nara Lokesh: 'చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం.. రాష్ట్ర మహిళలకేం భద్రతగా ఉంటారు?' - nara lokesh updates

సీఎం జగన్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. దిశ చట్టం వల్ల రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డకు న్యాయం జరగలేదన్నారు. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం.. రాష్ట్రంలో ఉన్న మహిళలకేం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. సొంత నియోజక వర్గంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే.. ఈ రోజు వరకు నిందితులను పట్టుకోకపోవటం ముఖ్యమంత్రి చేతగానితనానికి నిదర్శనమని అన్నారు.

nara lokesh
నారా లోకేశ్
author img

By

Published : Aug 15, 2021, 6:45 PM IST

  • దిశ చట్టం అంటూ @ysjagan గారు బిగ్గరగా అరవడం.. వైకాపా బ్యాండ్ బ్యాచ్ ఈలలు,కేకలు వెయ్యడం తప్ప ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరిగింది లేదు. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం..రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇంకేమి రక్షణ కల్పిస్తారు? (1/3)

    — Lokesh Nara (@naralokesh) August 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులను మద్యం షాపులు ముందు క్యూ లైన్ల నియంత్రణ కోసం నిలబెట్టి అవమానించారు @ysjagan.నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కనీసం రెండు రోజుల ముందు ఆహ్వానం తెలపరా?బుద్ధి,జ్ఞానం లేదా?మీరు మాస్టార్లా గాడిదలా అంటూ రెచ్చిపోయాడు వైకాపా నాయకుడు.(1/2) pic.twitter.com/sIo4k8QsGr

"దిశ చట్టం అంటూ వైఎస్ జగన్ బిగ్గరగా అరవడం.. వైకాపా బ్యాండ్ బ్యాచ్ అరుపులు, కేకలు వేయటం తప్ప.. ఆ చట్టంతో ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరగలేదు" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం.. రాష్ట్రంలో ఉన్న మహిళలకేం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. సొంత నియోజక వర్గంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే ఈ రోజు వరకు నిందితులను పట్టుకోకపోవటం ముఖ్యమంత్రి చేతగాని తనానికి నిదర్శనమని అన్నారు.

"స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జగన్ రెడ్డి దిశ చట్టం, మహిళల రక్షణ అంటూ ఉపన్యాసం ఇస్తున్న సమయంలోనే.. గుంటూరులో దళిత యువతి రమ్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ మృగాడు" అని నారా లోకేశ్ అన్నారు. హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

'ఉపాధ్యాయులను అగౌరవపర్చడం నిత్యకృత్యం అయ్యింది'

స్వాతంత్య్ర దినోత్సవాలకు కనీసం రెండు రోజుల ముందు ఆహ్వానం తెలపరా అంటూ వైకాపా నాయకుడు ఉపాధ్యాయులపై రెచ్చిపోవడం ఏంటని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను అగౌరవపర్చడం వైకాపా నాయకులకు నిత్యకృత్యం అయ్యిందని విమర్శించారు. టీచర్లపై నోరుపారేసుకున్న విజయనగరం జిల్లా జగన్నాధపురం గ్రామం వైకాపా నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులను మద్యం షాపులు ముందు క్యూలైన్ల నియంత్రణ కోసం నిలబెట్టి జగన్ అవమానించారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

PATTABIRAM: 'సబ్ లీజుల పేరుతో మంత్రి వెల్లంపల్లి భారీ ఇసుక దోపిడీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.