విజయనగరం జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డును పార్లమెంటు సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ సందర్శించారు. వైద్యులతో మాట్లాడిన ఆయన.. రోగులకు అందిస్తున్న వైద్యసేవల వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, వారు కోలుకునేంత వరకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు బెల్లాన చంద్రశేఖర్ సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు పడకలు లేవని నిరాకరించవద్దని కోరారు. ఆక్సిజన్ సరఫరాపై వైద్యులతో మాట్లాడిన ఎంపీ.. ప్రాణవాయువు సరఫరా విధానాన్ని తెలుసుకున్నారు.
ఇదీచదవండి. హైకోర్టుకు తెదేపా : పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ పిటిషన్