ETV Bharat / state

ఇండియా బోర్డు ప్రెసిడెంట్​ - దక్షిణాఫ్రికా మ్యాచ్​ ప్రారంభం - vijayanagaram pvg raju cricket academy

ఇండియా బోర్డు ప్రెసిడెంట్​ - దక్షిణాఫ్రికా మధ్య సన్నాహక మ్యాచ్​ విజయనగరం జిల్లా చింతలవలసలోని పీవీజీ రాజు క్రికెట్​ అకాడమీ మైదానంలో ప్రారంభమైంది. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సఫారీ జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మ్యాచ్​ వీక్షించేందుకు పెద్ద ఎత్తున క్రికెట్​ అభిమానులు, విద్యార్థులు, యువత తరలివచ్చారు.

ఇండియా బోర్డు ప్రెసిడెంట్​ - దక్షిణాఫ్రికా మ్యాచ్​ ప్రారంభం
author img

By

Published : Sep 27, 2019, 11:51 PM IST

ఇండియా బోర్డు ప్రెసిడెంట్​ - దక్షిణాఫ్రికా మ్యాచ్​ ప్రారంభం

విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలసలోని పీవీజీ రాజు క్రికెట్ అకాడమీ మైదానం అంతర్జాతీయ మ్యాచ్​కు వేదికగా మారింది. విశాఖపట్నం వేదికగా అక్టోబరు 2 నుంచి ఆరో తేదీ వరకు ఇండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఇండియా బోర్డు ప్రెసిడెంట్ - దక్షిణాఫ్రికా జట్ల సన్నాహక మ్యాచ్​ ఇక్కడ ప్రారంభమైంది. తొలిరోజు వర్షంతో రద్దయిన మ్యాచ్​ రెండో రోజుకు వాతావరణం అనుకూలించడం వల్ల ప్రారంభమైంది. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సపారీ జట్టు... ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లకు గానూ 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్​ మక్రం 118 బంతుల్లో శతకం సాధించి రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగాడు. హమాజ్ 92 బంతుల్లో 55 పరుగులతో క్రీజ్​లో కొనసాగుతున్నాడు. ఇండియా బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ బౌలింగ్​లో డి.ఎ.జడేజా 10 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఉమేష్ యాదవ్, ఇసాన్ పోరెల్ చేరో వికెట్ పడగొట్టారు. టీ విరామం తర్వాత మ్యాచ్ ఆరంభం కాగా., వెలుతురు సరిగా లేని కారణంగా అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపివేశారు.

క్రీడాభిమానుల సందడి

మొదటిసారిగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​కు పీవీజీ రాజు క్రీడాఅకాడమీ వేదికగా మారడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నార్తజోన్​ అకాడమీ తగిన ఏర్పాట్లు చేసి... వీక్షకులకు ఉచిత ప్రవేశాన్ని కల్పించింది. క్రికెట్ అభిమానులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, స్థానిక యువత పెద్ద ఎత్తున మ్యాచ్​ను తిలకించేందుకు తరలి వచ్చి... ఈలలు, కేరింతలతో సందడి చేశారు.

ఇదీ చూడండి :

స్వశక్తి పై నిలబడేందుకు అండగా.. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్!

Intro:AP_CDP_27_27_NYAYA_VIZNA_SADASDU_AP10121

Body:కడప జిల్లా మైదుకూరు మేధా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మోటార్ వాహన చట్టం, ర్యాగింగ్ వ్యతిరేక చట్టాల తోపాటు రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులు గురించి న్యాయమూర్తి బేబిరాణి విద్యార్థులకు అవగాహన కల్పించారు ద్విచక్ర వాహనం నడిపే వారు విధిగా హెల్మెట్ ధరించాలని,18 ఏళ్లు దాటిన తర్వాత లైసెన్స్ తీసుకొని వాహనం నడపాలని విద్యార్థులకు సూచించారు. లైసెన్సు లేకుండా వాహనం నడిపితే శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు వాహనానికి బీమా చేయించాలని సూచించారు. ర్యాగింగ్కు పాల్పడితే ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష లో ఉన్నట్టు తెలిపారు. ఖాళీ బాండు పత్రాల పై సంతకాలు చేయరాదని, ఒకసారి రాసిన ప్రాంసరీ నోటు కు మూడేళ్ల వరకు మాత్రమే గడువు ఉంటుందని తెలిపారు.

Conclusion:Byte: బేబీ రాణి, న్యాయమూర్తి, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, మైదుకూరు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.