కరోనా కాటుకు గురైన వ్యక్తి…. రిక్షాలోనే కన్నుమూసిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. బిహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన రాకేష్ కుమార్.., తన కుమారుడు బంటితో కలసి బతుకుదెరువుకు విజయనగరం వచ్చారు. తండ్రి రాకేశ్‌కు కరోనా సోకి ఆరోగ్యం విషమించింది. చికిత్స కోసం తండ్రిని కుమారుడు రిక్షా ఎక్కించి జిల్లా కేంద్ర ఆసుపత్రికి బయలుదేరారు. ట్యాంక్ బండ్ రోడ్డుకు వచ్చే సరికే రిక్షాలోనే రాకేశ్ అచేతనంగా పడిపోయారు. ఈ క్రమంలో కుమారుడు ఏం చేయాలో తెలియక రోడ్డు మీదే విలపించాడు. ఈ విషయం తెలిసిన విజయనగరం ఫేస్బుక్ సంస్థ నిర్వాహకులు… అంబులెన్స్‌లో రాకేశ్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు.
ఇదీ చదవండి