ETV Bharat / state

మద్యం కోసం మహిళలు క్యూ.. దీని వెనక ఓ కథ ఉందండోయ్

author img

By

Published : Jul 17, 2020, 11:34 PM IST

Updated : Jul 18, 2020, 12:53 PM IST

మందుబాబులం మేము మందుబాబులం అనే పాట వినే ఉంటారు కదా..! కానీ ఈ తంతు చూస్తే మందుబాబులం పదం మార్చాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. విజయనగరం జిల్లా జామి మండల కేంద్రంలో మహిళలు మద్యం దుకాణం ముందు క్యూకట్టారు. వీళ్లంతా మందు కొడతారనుకుంటే.. మీరు తప్పులో కాలేసినట్లే. ఈ క్యూ వెనుక ఓ కథ ఉంది. అదేంటో చదవండి.

మద్యం కోసం మహిళలు క్యూ.. ఈ క్యూ వెనక ఓ కథ ఉందండోయ్

సాధారణంగా మహిళలు రేషన్ దుకాణాలు, పింఛన్ల పంపిణీ, ఇతర ప్రదేశాల్లో పురుషులతో పాటు ప్రత్యేకంగా క్యూ కట్టడం చూస్తాం. విజయనగరం జిల్లా జామి మండల కేంద్రం వద్ద ఇందుకు విభిన్నంగా మద్యం దుకాణం వద్ద మహిళలు ప్రత్యేకంగా క్యూ కట్టారు. మద్యం కోసం మహిళలు పురుషులతో సమానంగా గొడుగులు పట్టుకొని ప్రత్యేక వరుస కట్టడం చూసి అందరూ అవాక్కయ్యారు.

మద్యం కొనుగోలుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావటం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే... ఈ తంతు వెనక బెల్టుషాపుల నిర్వాహకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. బెల్టుషాపుల యజమానులు మద్యం బాటిల్ ఒక్కొక్కదానికి రూ.50 చెల్లిస్తుండటంతో మహిళలు మద్యం దుకాణం వద్ద బారులు తీరినట్లు తెలిసింది.

ఇక్కడ క్యూలో నిల్చున్న చాలా మందికి మద్యం తాగే అలవాటు ఉండదు. బెల్టు షాపు వాళ్లు నేరుగా మద్యం కొనేందుకు అవకాశం లేదు. అందుకే స్థానికంగా ఉండే మహిళలను పురామాయించి ఇలా మద్యం కొనుగోలు చేయిస్తారు. అందుకుగాను ఒక్కో బాటిల్​కు 50 రూపాయల కమిషన్​ను బెల్టుదుకాణందారు చెల్లిస్తాడు.

ఇదమన్నమాట మద్యం దుకాణాల ముందు మహిళల బారులు తీరడం వెనుక ఉన్న కథ.

ఇదీ చదవండి : ఒకే అంబులెన్స్​లో కుక్కి కుక్కి ఎక్కిస్తారా?... ఇంత నిర్లక్ష్యమా ? : చంద్రబాబు

Last Updated : Jul 18, 2020, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.