ETV Bharat / state

'ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలి'

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి ఐటీడీఏ పీవో కూర్మనాథ్ సూచించారు. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

itda po kurmanath visit village secretariats in saluru mandal vizianagaram district
ఐటీడీఏ పీవో కూర్మనాథ్
author img

By

Published : Nov 18, 2020, 8:49 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని సచివాలయాలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్ సందర్శించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందించాలని సిబ్బందికి సూచించారు. గ్రామ సచివాలయాలకు వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.

జిగిరాం గ్రామంలో సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఉద్యోగుల హాజరు పట్టీని పరిశీలించారు. సంక్షేమ పథకాల కోసం అందే వినతుల పరిష్కారం నిమిత్తం చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయాలకు మంచి పేరు తీసుకురావడమనేది సిబ్బంది చేతుల్లోనే ఉందన్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని ఐటీడీఏ పీవో సూచించారు.

ఇవీ చదవండి:

12 రోజుల పాటు తుంగభద్ర పుష్కరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.