విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస, బర్రిపేటకు చెందిన 8 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి 20 రోజులవుతున్నా ఇంకా తిరిగి రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
వీరందరూ విశాఖ జిల్లా భీమిలి నుంచి చేపల వేటకు బయలుదేరారు. సాధారణంగా 10, 15 రోజుల్లో వేట నుంచి తిరిగి వస్తారు. అయితే 20 రోజులవుతున్నా వారు రాకపోవటంతో ఆందోళన నెలకొంది. 4 రోజుల కిందట నివర్ తుపాను వచ్చింది. దాంతో జాలర్ల కుటుంబసభ్యుల భయం మరింత పెరిగింది. ఒకవేళ దారితప్పి ఇతర దేశాల సముద్రజలాల్లోకి వెళ్లి ఉంటారనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకుని మత్స్యకారుల ఆచూకీ తెలియజేయాలని బాధిత కుటుంబీకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి...