విజయనగరంజిల్లా పాచిపెంట వెలుగు కార్యాలయంలో జరిగిన అవినీతి(financial irregularities) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో అక్కడ పనిచేసిన ఏపీఎం ఇలిగాపు సత్యనారాయణ... శ్రీనిధి, వడ్డీ లేని రుణాలు, ఉన్నతి పథకాలలో కమిషన్ల వసూలుకు పాల్పడినట్లు మండల సమాఖ్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్ ఆదేశాల మేరకు ఏపీడీ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు.
దాదాపు రూ.10 లక్షల వరకు అక్రమ వసూళ్లు జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అంతేకాక ఏపీఎం భార్య విజయలక్ష్మికి వెలుగు ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించినట్లు చెప్పాడు. దీనిపై వివరణ ఇవ్వాలని.. ఏపీఎం సత్యనారాయణకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. ఇప్పటివరకు అతను స్పందించలేదని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
lorry accident : గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా...తప్పిన ప్రమాదం