Mother Committed Suicide Daughter Attempted Suicide : ఈ మధ్య కాలంలో యువత ప్రేమలో పడటం చాలా కామన్ అయిపోతుంది. ఆ ప్రేమను దక్కిించుకోవడానికి తల్లిదండ్రులతో గొడవలు పడుతుంటారు. ఈ గొడవల కారణంగా మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు ఎవ్వరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఓ తల్లి తీసుకున్న నిర్ణయానికి ఒకరు లోకాలను విడిచి వెళ్లగా.. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఈ విషాద సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇంట్లో తల్లి, కూతురు మధ్య జరిగిన మాటల సంఘర్షణ వారి ప్రాణాల మీదకు తీసుకు వచ్చింది. చివరికి కూతురు ప్రాణాపాయస్థితిలో ఉండగా తల్లి మాత్రం మృత్యు ఒడికి చేరింది.
ప్రేమ వ్యవహారం.. ఆ ఇంట్లో తల్లీ కూతుళ్ల మధ్య ఘర్షణకు దారితీసి వారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటనతో తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, మనస్తాపానికి గురైన కుమార్తె ఆత్మహత్యకు యత్నించి అపస్మారక స్థితికి చేరుకుంది. సోమవారం వేకువజామున విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నెల్లిమర్లలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్య(45), కుమార్తె(28)తో కలిసి జీవిస్తున్నాడు. అతని కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. కుమార్తె ఓ సాఫ్ట్వేర కంపెనీలో పని చేస్తోంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో ఉంటూ విధులు నిర్వహిస్తోంది.
ఈమె కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ విషయాన్ని ఆదివారం రాత్రి తల్లికి చెప్పింది. ఆ వ్యక్తినే వివాహం చేసుకుంటానని చెప్పింది. ఆ యువకుడికి ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో తల్లీ కూతుళ్ల మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో తల్లి క్షణికావేశంతో మదుమేహం పరీక్ష నిమిత్తం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి సెగిడివీధి సమీపంలోని పట్టాలపై రైలుకు అడ్డంగా నిల్చుని ఆత్మహత్యకు పాల్పడింది.
తల్లి మరణానికి తానే కారణమని తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్తె ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపుకు గడియ పెట్టి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గమనించిన స్థానికులు, బంధువులు వెంటనే తలుపులు పగులగొట్టి ఆమెను కిందకు దించి ప్రమాదం నుంచి రక్షించారు. అనంతరం ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అపస్మార కస్థితిలో ఉన్న ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నట్లు నెల్లిమర్ల పోలీసులు తెలిపారు.