ETV Bharat / state

మారుతున్న సాగుతీరు.. భూసారాన్ని పెంచేలా సేంద్రీయ విధానాలు - సేంద్రీయపద్దతిలో పంటలు

రాష్ట్రంలో పంటల సరళి క్రమంగా మారుతోంది. సాగులో తిరిగి సనాతన పద్ధతుల దిశగా రైతులు సాగుచేస్తున్నారు. భూసారాన్ని పెంపొందించే సేంద్రీయ విధానాలనూ అనుసరిస్తున్నారు. ఇటు ప్రభుత్వ పథకాలు చేయుత అందిస్తుండటంతో.. ప్రకృతి సేద్యం, పెట్టుబడి రహిత విధానాల పట్ల పెద్దఎత్తున రైతులు మొగ్గు చూపుతున్నారు.

farmers changed
farmers changed
author img

By

Published : Jul 14, 2020, 5:44 PM IST

విజయనగరం జిల్లాలో ఔత్సాహిక రైతులు సాగును సనాతన పద్దతుల దిశగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు ముందు నవ ధాన్యాలను సాగుచేస్తూ... నేలల్లో సేంద్రీయ కర్బన శాతాన్నిపెంపొందించుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ అవకాశాన్ని మహిళా సంఘాలు ఆర్థికంగా అందిపుచ్చుకున్నాయి. రైతులకు అవసరమైన అన్ని రకాల నవధాన్యాలను సేకరించి.. గంపగుత్తుగా అందిస్తున్నాయి. వీటితో పాటు.. పెరటి తోటల విత్తనాలను సైతం సరఫరా చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నాయి. ఏపీ కమ్యూనీటి మేనేజ్డ్ ప్రకృతి వ్యవసాయం పథకం ద్వారా కరోనా కష్టకాలంలో ఇంటిపట్టునే ఉంటూ నాలుగు పైసలు సంపాదిస్తూ.. ఇతరజిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

సేంద్రీయ సాగు విస్తరణలో జిల్లాకు రెండో స్థానం

రాష్ట్రంలో ప్రకృతి, సేంద్రీయ పంటల సాగు విస్తరిస్తున్న జిల్లాలో విజయనగరంజిల్లా రెండో స్థానంలో ఉంది. కేవలం ఆహార పంటల్లోనే కాకుండా.. ఉద్యాన పంటల సాగులో సైతం సేంద్రీయ విధానాల దిశగా రైతులు సాగుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 52 క్లస్టర్లలో 37వేల ఎకరాల్లో సేంద్రీయ విధానం ద్వారా పంటల సాగు జరుగుతోంది. ఈ ఏడాది ఈ విస్తీర్ణాన్ని 45వేల హెక్టార్లకు పెంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అధికారులు ఈ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు.

భూసారాన్ని పెంచేలా చర్యలు

అంతేకాదు.. మరింత మెరుగైన సేంద్రీయ, ప్రకృతి సేద్య విధానాలను పాటించేలా రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రీయ విధానంలో భూసారాన్ని పెంపొందించేందుకు ఔత్సాహిక రైతులకు చేయూతనిస్తున్నారు. నవ్యధాన్యాల్లో పచ్చిరొట్టే, పప్పుజాతి, నూనెగింజలు, సుగంధ జాతీ గింజలు, రాగులు, మొక్కజొన్నల వంటి ధాన్యం గింజలను ఖరీఫ్ కు ముందు రైతుల పొలాల్లో సాగు చేయిస్తున్నారు. నవధాన్యాలకు చెందిన సుమారు 19 నుంచి 21 రకాల విత్తనాలను ఖరీఫ్ సాగు చేయబోయే పొలాల్లో ముందస్తుగా వేయిస్తున్నారు.

"ఏపీ కమ్యూనీటి మేనేజ్డ్ ప్రకృతి వ్యవసాయం" పథకం ద్వారా విజయనగరంజిల్లాలోని 10వ్యవసాయ క్లస్టర్ల పరిధిలోని మహిళా సంఘాలు, రైతు సంఘాలు నవధాన్య విత్తన సేకరణ క్రతువులోపాలుపుంచుకుంటున్నాయి. మూడు రకాల విత్తనాలు మాత్రం వ్యవసాయశాఖ రాయితీపై అందిస్తుండగా.. మిగిలిన రకాలను రైతుల నుంచి సేకరిస్తున్నారు.

సిద్దం చేసిన విత్తనాలను జిల్లాలోని రైతులకే కాకుండా... వ్యవసాయశాఖ సహకారంతో ఇతర జిల్లాల రైతులకు సైతం మహిళా సంఘాలు సరఫరా చేస్తున్నారు. కరోనా విజృభిస్తున్న క్రమంలో ఇంటిపట్టునే ఉంటున్న తమకు ఈ వ్యాపకం ఒక ఆదాయ వనరుగా మారిందని మహిళ చెబుతున్నాయి. విజయనగరంజిల్లా గ్రామీణ మహిళా సంఘాలు నవధాన్యాలు, పెరటి తోటల విత్తన సేకరణ ద్వారా కరోనా కష్ట కాలంలో ఉన్నచోటే ఆదాయ మార్గాలను సృష్టించు కుంటున్నాయి. ఆదాయ పరంగానే కాకుండా.. తోటి రైతులకు సహాయకారిగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఇదీ చదవండి:

గాలి ద్వారా కరోనా.. అడ్డుకోవడం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.