ETV Bharat / state

దుకాణం బందైంది... మరి మందు ఏమైంది! - దుకాణం బందైంది... మరి మందు ఏమైంది!

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 22 నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు మూతపడ్డాయి. దుకాణాలకు సీళ్లు వేశారు. అప్పటి నుంచి అక్కడ పని చేస్తున్న సిబ్బందికే పగలు, రాత్రి సంరక్షణ బాధ్యతలను అప్పగించారు. ఇన్ని చేసినా.. కొన్ని ప్రాంతాల్లో మద్యం బహిరంగంగా లభ్యమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో విజయనగరంలోని మద్యం దుకాణాల్లో ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

vijayanagaram district
దుకాణం బందైంది... మరి మందు ఏమైంది!
author img

By

Published : Apr 10, 2020, 8:36 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ.. మద్యం అమ్మకాలు నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో మద్యం బహిరంగంగానే లభ్యమవుతోంది. విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఎక్కువగా మద్యం కొని నిల్వ ఉంచుకున్నాయన్న ఆరోపణలూ బలంగా వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఒడిశా నుంచి అక్రమ మార్గాల్లో జిల్లాకు మద్యం రవాణా అవ్వటం ఒక ఎత్తయితే.. ఇక్కడున్న మద్యం దుకాణాల నుంచే నిల్వలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు రావటం మరో ఎత్తు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటంతో అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలనూ తనిఖీ చేయాలని ఆదేశాలొచ్చాయి. ఆ మేరకు జిల్లా ఎక్సైజ్‌ అధికారులు మూడు రోజులుగా తనిఖీలు చేసి, సరకు నిల్వలను లెక్కిస్తున్నారు.

రెండు చోట్ల భారీగా తేడాలు

జిల్లాలో 168 ప్రభుత్వ మద్యం దుకాణాలుండగా వీటిని దశలవారీగా ఎక్సైజ్‌ అధికారులు తనిఖీ చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో మొత్తం 21 దుకాణాలను తనిఖీ చేశారు. పార్వతీపురం డివిజన్‌ పరిధిలో పలు లోపాలు వెలుగుచూశాయి. మక్కువ దుకాణంలో రూ.1.70 లక్షల మేర సరకు తేడా ఉన్నట్లు గుర్తించారు. గుమ్మలక్ష్మీపురంలోనూ రూ.22 వేల మేర తేడా ఉంది. ఆయా దుకాణాల నిర్వాహకుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేసి, వారిపై కేసులు నమోదు చేశారు. గురువారం కూడా జిల్లాలోని పలుచోట్ల తనిఖీలు సాగాయి. విజయనగరం పట్టణంలో మొత్తం 17 దుకాణాలుండగా.. రెండురోజుల్లో 6 దుకాణాలను పరిశీలించారు.

దుకాణాల సిబ్బంది పనేనా..

ప్రతి దుకాణంలోనూ సూపర్‌వైజర్‌, సేల్స్‌మెన్లు ఉంటారు. వీరితోపాటు.. వాచ్‌మెన్లు ఉంటారు. నిల్వలు పక్కదారి పట్టడంలో చాలాచోట్ల వీరి పాత్రే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ పరిశీలించిన దుకాణాల్లో కొద్ది మొత్తంలోనైనా తేడా ఉన్నట్లు గుర్తించారు. మక్కువ, గుమ్మలక్ష్మీపురంల్లో పెద్ద మొత్తంలో సరకు మాయం కావటంతో.. ఆ మొత్తాన్ని సిబ్బంది నుంచే రికవరీ చేసి, వారిని విధుల నుంచి తొలగించనున్నామని మద్యనిషేధ, అబ్కారీశాఖ సహాయ కమిషనర్‌ ఎస్‌వీవీఎన్‌ బాబ్జీరావు తెలిపారు.

మక్కువలో రూ. 1.7 లక్షల సరకులు అవకతవకలు

మద్యం దుకాణాల్లో అవకతవకలను గుర్తించేందుకు బుధవారం మక్కువ, రామభద్రపురం గ్రామాల్లోని పలు మద్యం దుకాణాల్లో అబ్కారీ సూపరింటెండెంట్‌ రామచంద్రరావు, సాలూరు అబ్కారీ సీఐ బాలనరశింహ తనిఖీలు చేపట్టారు. మక్కువలోని ఒక దుకాణంలో రూ.1.71,308లు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. అక్కడి సూపర్‌వైజర్‌ మణికంఠ నుంచి రికవరీ చేసి గురువారం ప్రభుత్వానికి చెల్లించామని సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:

ఆ జిల్లాల్లో ఒక్క కరోనా కేసు లేదు... కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.