ETV Bharat / state

ఏనుగు దాడిలో రైతు మృతి - ఏనుగుల దాడిలో రైతు మృతి వార్తలు

elephant- attack on farmer
ఏనుగు దాడిలో రైతు మృతి
author img

By

Published : Nov 13, 2020, 8:14 AM IST

Updated : Nov 13, 2020, 9:07 AM IST

08:12 November 13

ఏనుగు దాడిలో రైతు మృతి

విజయనగరం జిల్లా కొమరాడ మండలం పరశురామ్‌పురంలో రైతుపై ఏనుగు దాడి చేసింది. ఘటనలో లక్ష్మినాయుడు అనే రైతు మృతిచెందాడు. లక్ష్మినాయుడు వేకువజామున వరి పొలానికి వెళ్లగా... పక్కన ఉన్న టేకు తోటలో ఒంటరిగా ఉన్న ఏనుగు ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. దీంతో రైతు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. రైతు మృతితో పరుశరామ్​పురంలో విషాదం నెలకొంది. జిల్లాలో మూడేళ్లలో ఏనుగుల దాడిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు కొమరాడలో ముగ్గురు, జియ్యమ్మవలసలో ఇద్దరు, గరుగుబిల్లి మండలాల్లో ఒక్కరు ఏనుగుల దాడికి గురై మృతి చెందారు.

కొన్నేళ్లుగా అడవి ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ... పంటలను నష్టపరుస్తున్నాయని స్థానికులు తలిపారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: 

రెండేళ్ల వయసులోనే అద్భుత ప్రతిభ... జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తున్న బుడతడు...

Last Updated : Nov 13, 2020, 9:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.