ETV Bharat / state

పట్టుచెన్నారులో ఎన్నికలు జరగనివ్వమంటున్న ఒడిశా.. జరిపితీరుతామంటున్న ఏపీ... - ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో ఎన్నికల నిర్వహణ

ఆంధ్రా- ఒడిశా సరిహద్దు, విజయనగరం జిల్లాలోని కుటియా పరిధిలోని 4 పంచాయతీల్లో 3 ఏకగ్రీవం అయ్యాయి. పట్టుచెన్నారులో ఎన్నికలు జరగనివ్వమని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. ఎలా అయినా నిర్వహిస్తామని ఏపీ అధికారులు తేల్చిచెప్పారు. అవసరమైతే అదనపు బలగాలనూ సిద్ధం చేస్తామని వెల్లడించారు.

elections issue
elections issue
author img

By

Published : Feb 11, 2021, 12:42 PM IST

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు, విజయనగరం జిల్లా కుటియా పరిధిలోని 4 పంచాయతీల్లో మూడు ఏకగ్రీవమయ్యాయి. కానీ పట్టు చెన్నారులో అభ్యర్థులు బరిలో నిలవడంతో.. ఆ గ్రామంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ ఎన్నికలు జరగనివ్వమని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేయగా.. ఎలా అయినా నిర్వహిస్తామని ఎన్నికల ప్రత్యేక అధికారులు తేల్చిచెప్పారు. ఇక్కడి ప్రజలు ఎన్నికలపై ఎంతో ఆసక్తిగా ఉన్నారన్నారు. ఆ గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనందున ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. అవసరమైతే అదనపు బలగాలనూ ఏర్పాటు చేస్తామన్నారు.

పట్టుచెన్నారులో ఎన్నికలు జరగనివ్వమంటున్న ఒడిశా.. జరిపితీరుతామంటున్న అధికారులు

ఇదీ చదవండి: మా భూభాగంలో ఏపీ పంచాయతీ ఎన్నికలా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.