విజయనగరం ఆర్ అండ్ బీ రైతు బజార్ వద్ద కరోనా వ్యాధి నిరోధక క్రిమిసంహారక టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. రౌండ్ టేబుల్ ఆఫ్ విజయనగరం సంస్థ ఆధ్వర్యంలో ఈ టన్నెల్ ఏర్పాటైంది. వైకాపా జిల్లా యువజన విభాగం నాయకుడు ఈశ్వర్ కౌశిక్, జిల్లా వైకాపా కార్యకలాపాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఈ టన్నెల్ ను ప్రారంభించారు. ప్రజల సహకారంతోనే జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా ఇప్పటివరకూ నమోదు కాలేదన్నారు. ఇదే స్ఫూర్తితో కరోనాను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: