విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని స్థానిక సామాజిక ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించే టునాట్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రారంభించారు. 13 లక్షల విలువచేసే ఈ ల్యాబ్ ద్వారా ప్రతి రోజు 60 మంది రోగులకు కరోనా పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా సామాజిక ఆసుపత్రిలో ఈ ల్యాబ్ ప్రారంభం కావడం విశేషమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్య శేఖర్, డాక్టర్ త్రినాధ రావు, వైకాపా నాయకులు రఘు రాజు రెహమాన్, తహసీల్దార్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...