విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం దలైవలస గ్రామంలో వెలుగు శాఖలోని వి.ఓ.ఏ ఉద్యోగం కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఉద్యోగం విషయమై ఇరువర్గాలు ఏ.పి.ఎం భారతి వద్దకు అధిక సంఖ్యలో రాగా లాక్ డౌన్ నిబంధనల ప్రకారం కొద్దిమంది ముఖ్యులు వస్తే చర్చిద్దామని చెప్పి ఆమె వెనుదిరిగారు. అనంతరం ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సింహాచలం ఇరు వర్గాలతో చర్చించి వివాదం సద్దుమణిగేలా చేశారు. గాయపడిన వారిని పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఉద్యోగం కోసం ఇరువర్గాల మధ్య వివాదం.. పలువురికి గాయాలు
వెలుగు శాఖలోని ఉద్యోగం కోసం ఇరువర్గాల మధ్య వివాదం నెలకొన్న ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. ఘర్షణలో పలువురు స్వల్పంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం దలైవలస గ్రామంలో వెలుగు శాఖలోని వి.ఓ.ఏ ఉద్యోగం కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఉద్యోగం విషయమై ఇరువర్గాలు ఏ.పి.ఎం భారతి వద్దకు అధిక సంఖ్యలో రాగా లాక్ డౌన్ నిబంధనల ప్రకారం కొద్దిమంది ముఖ్యులు వస్తే చర్చిద్దామని చెప్పి ఆమె వెనుదిరిగారు. అనంతరం ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సింహాచలం ఇరు వర్గాలతో చర్చించి వివాదం సద్దుమణిగేలా చేశారు. గాయపడిన వారిని పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: పోస్ట్మార్టం చేద్దామనుకుంటే లేచి కూర్చున్నాడు!