విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ కేంద్రాన్ని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో భాగంగా...గ్రామ వాలంటీర్లుగా 1395 మందిని ఎంపిక చేశారు. వీరంతా రెండు రోజులు శిక్షణ పొందనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు 50 శాతం ఉద్యోగాలు ఇస్తానని చెప్పినట్లుగానే... రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. వాలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులంతా... ప్రజలతో మమేకమవ్వాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇది చూడండి: ఆపరేషన్ కశ్మీర్: ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా గృహనిర్బంధం