విజయనగరం జిల్లాలోని గులాబ్ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ఎ.సూర్యకుమారి మంగళవారం విస్తృతంగా పర్యటించారు. సహాయ, పునరుద్దరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటమునిగిన పంటలను, నేలకొరిగిన చెట్లను, విద్యుత్ స్తంభాలను, పొంగిపొర్లుతున్న వాగులనూ, నదులను, దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. రైతులు, బాధితులతో మాట్లాడి, పరిస్థితిని తెలుసుకున్నారు. అధికారులతో సమావేశమై, పునరుద్ధరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా కలెక్టర్ అకస్మాత్తుగా పర్యటించడంతో ఆయా ప్రాంతాల్లోని అధికారులు, ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ప్రజలకు కరోనా వాక్సిన్ అందజేతపై కూడా వాకబు చేశారు.
ఈ పర్యటనలో ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, హౌసింగ్, పంచాయితీరాజ్, ఆర్అండ్‌బి, ఇరిగేషన్ తదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : Anandaiah: కరోనా మందు ప్రజల్లోకి రానివ్వలేదు: ఆనందయ్య