ETV Bharat / state

సిక్కోలులో విజృంభిస్తున్న కరోనా.. పరిస్థితిపై కలెక్టర్​ సమీక్ష

author img

By

Published : Jul 9, 2020, 11:10 PM IST

జ్వరం ఇతర లక్షణాలు ఉన్నవారు నేరుగా జేమ్స్, రిమ్స్ ఆసుపత్రికి రావచ్చునని జిల్లా కలెక్టర్​ జె.నివాస్​ తెలిపారు. ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో శాంపిల్ సేకరణలో అధికారుల అలసత్వంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

collector nivas review meeting
శిక్కొలులో విజృంభిస్తున్న కరోనా పరిస్థితిపై కలెక్టర్​ సమీక్ష

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో కేసులు పెరుగుతున్న కారణంగా నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో కరోనా కేసులు, కంటెయిన్​మెంట్​ జోన్​లు పెరుగుతున్నాయని తెలిపారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లోని ప్రతి ఇంటి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నట్టు వివరించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి...

హైడ్రోజన్ ఇంధనంవైపు అడుగులు.. ఫలిస్తున్న యువకుడి పరిశోధనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.