విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మార్చి 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ హరిజవహర్ లాల్ పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సాలూరు మున్సిపల్ కమిషనర్, అధికారులను అదేశించారు. అలసత్వం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి