జిల్లాలోని చీపురుపల్లి నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించిన బొత్స సత్యనారాయణకు అమాత్య యోగం దక్కింది. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లోనూ బొత్స మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా... ఒకసారి ఎంపీగా పనిచేసిన అనుభవం బొత్సకు ఉంది. 1999లో బొబ్బిలి ఎంపీగా గెలుపొందారు. 2004, 2009లో చీపురుపల్లి నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. 2004లో భారీ పరిశ్రమలు, 2009లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో రోశయ్య నేతృత్వంలో పంచాయతీరాజ్... కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
నియోజకవర్గం: చీపురుపల్లి
వయస్సు: 61
విద్యార్హత: బీఏ
రాజకీయ అనుభవం: నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.
కురుపాం నుంచి గెలుపొందిన పాముల పుష్పశ్రీవాణిని మంత్రిపదవి వరించింది. బీఎస్సీ, బీఈడీ విద్యనభ్యసించిన పుష్ప శ్రీవాణి... ఇప్పటివరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2019లో రెండుసార్లూ... కురుపాం నియోజకవర్గం నుంచే గెలిచారు. 33 సంవత్సరాలకే మంత్రి పదవి యోగం దక్కింది.
నియోజకవర్గం: కురుపాం
వయస్సు: 31
విద్యార్హత: బీఎస్సీ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు