బొండపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్లు చోరీ అయ్యాయి. తహసీల్దార్ గదిలో ఒకటి, కంప్యూటర్ ఆపరేటర్‌కు చెందిన రెండింటిని దుండగులు అపహరించారు. ఉదయం విధులకు హాజరైన ఉద్యోగులు... ఆయా గదుల తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తహసీల్దార్ కార్యాలయం పైనుంచి దుండగులు లోపలికి ప్రవేశించి దోపిడి చేసినట్లు అధికారులు గుర్తించారు. తహసీల్దార్ సీతారామ రాజు ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీం వివరాలను సేకరించింది. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఇదీ చదవండి: