విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ బస్టాండ్లో ఈనెల 17న జరిగిన నగదు చోరీని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. కొబ్బరికాయల వ్యాపారి శ్రీనివాసరావు వద్ద నుంచి రూ. 4.50 లక్షలు దోపిడీ చేయగా.. విశాఖ జిల్లాకు చెందిన కూమార స్వామి, అప్పారావు, రాజమండ్రికి చెందిన సత్యనారాయణను ఈ కేసులో అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకోగలిగామని సీఐ కేశవరావు వివరించారు. వారి నుంచి మొత్తం సొమ్ము స్వాధీనం చేసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నాడని తెలిపారు.
ఈనెల 17న దొంగిలించిన సొత్తుతో.. రామభద్రపురంలోని ఓ లాడ్జిలో నిందితులు బస చేశారు. బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. వారు దొరికినట్లు తెలిపారు. వీరిపై పలు ప్రాంతాల్లో కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ తరహా నేరాలు చేయడంలో వీరు సిద్ధహస్తులని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా దోపిడీలు అధికంగా జరిగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: