ఇదీ చదవండి: డిసెంబరు వరకు రుణ పరిమితి.. రూ.2,155 కోట్లే!
ఇది.. జలమా? మైదానమా?? - తోటపల్లి జలాశయం
ఈ చిత్రం చూస్తే పచ్చని పొలాల మధ్యలో నివాసం ఉన్నట్టుగా ఉంది కదూ! కానీ.. ఇది విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి జలాశయం. పెద్దఎత్తున గుర్రపుడెక్క పెరగడం, వ్యర్థాలు, చెత్త పేరుకుపోవడంతో ఇలా తయారైంది. దీంతో.. అధునాతన మరబోట్లు ముందుకు కదల్లేని దుస్థితి. ఇలాగే వదిలేస్తే అవి పాడయ్యే అవకాశం ఉంది. కొన్నిరోజులుగా బోటు షికారు నిలిచిపోవడంతో పర్యాటకుల సంఖ్య కూడా తగ్గింది. దీనిపై ప్రాజెక్టు డీఈ శ్రీహరి వివరణ కోరగా.. నీటిని కిందకు విడిచిపెడితే గుర్రపుడెక్క కొంతమేర పోతుందని, పూర్తిస్థాయిలో తొలగించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
హుషారు లేని బోటు షికారు
ఇదీ చదవండి: డిసెంబరు వరకు రుణ పరిమితి.. రూ.2,155 కోట్లే!