విజయనగరం జిల్లాను ఎయిడ్స్రహితంగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ పిలుపునిచ్చారు. హెచ్ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 30 వరకు కళాజాత బృందాలు, వీధినాటకాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ముందుగానే ఎంపిక చేసిన గ్రామాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. ఎయిడ్స్ ఎలా సంక్రమిస్తుంది, వ్యాప్తి, నివారణ, నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ఎయిడ్స్ కేసులు తగ్గుతున్నాయని.. పూర్తిగా నివారించడానికి ఇటువంటి ప్రచార కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.
ఇదీ చదవండి: బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన