ETV Bharat / state

వాలంటీర్​పై దాడి... నిందితులకు రిమాండ్ - vizianagaram latest crime news

విజయనగరం జిల్లా కందిరివలస గ్రామంలో వార్డు వాలంటీర్​గా పనిచేస్తున్న లక్ష్మణరావుపై అదే ఊరికి చెందినవారు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మణరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిందితులను రిమాండ్​కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వాలంటీర్​పై దాడి చేసిన నిందితులకు రిమాండ్

author img

By

Published : May 1, 2020, 11:35 PM IST

విజయనగరం జిల్లా కందిరివలస గ్రామంలో వార్డు వాలంటీర్​పై స్థానికులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కోన లక్ష్మణరావు వాలంటీర్​గా పని చేసేవాడు. విధుల్లో భాగంగా.. గ్రామంలోని ప్రజలకు కరోనా వైరస్​ నేపథ్యంలో బయటికి రాకుండా ఉండలాని గ్రామస్థులకు చెప్పేవాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చిన్నారావు, అతని తండ్రి సన్యాసి.. ఇద్దరూ లక్ష్మణరావుతో గొడవపడ్డారు.

అసలు కారణం....

ఈ వాలంటీర్ ఉద్యోగానికి లక్ష్మణరావు, చిన్నారావు పోటీపడగా... ఉద్యోగం కోన లక్ష్మణరావుకు దక్కింది. అది మనసులో పెట్టుకుని గత 20న లక్ష్మణరావు జిగిరామ్​ గ్రామం నుంచి కందిరివలసలో శానిటేషన్​ పనిమీద వెళ్లి వస్తుండగా దారి కాసి గాదిపల్లి చిన్నరావు కర్రతో లక్ష్మణరావుని కొట్టాడు. అనంతరం చేతితో గట్టిగా కొట్టాడు. తర్వాత కొంత దూరంలో చిన్నారావు తండ్రి సన్యాసి, చిన్నారావు తమ్ముడు రామకృష్ణ ముగ్గురూ కలిసి ముగ్గురు లక్ష్మణరావుని కొట్టారు. ఈ విషయాన్ని బయట పెట్టకుండా సాలూరులోని ఓ ఆస్పత్రిలో ఆశావర్కర్​ ద్వారా నొప్పులకి మందులు తీసుకున్నాడు. అనంతరం 26న పాచిపెంట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాలూరు ప్రభుత్వాసుపత్రిలో లక్ష్మణరావుకి చికిత్స చేయించి విజయనగరం మహారాజా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్​కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నేపథ్యంలో నిందితులు వీఆర్వోని కలిసి జరిగిన విషయాన్ని చెప్పి పోలీసులకు లొంగిపోయారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపిస్తున్నట్లు సాలురు సీఐ సింహాద్రి నాయుడు వెల్లడించారు.

ఇదీ చూడండి: కరోనాపై అవగాహన కలిగిస్తుండగా దాడి.. వాలంటీర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.